BREAKING
thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Date of Publish : 23 September 2026, 07:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో కుండపోత.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 07:25 PM
31 వీక్షణలు

తిరువూరు: తుఫాన్ ప్రభావంతో తిరువూరు పట్టణంలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ప్రధాన రహదారులపైకి పెద్దఎత్తున వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పట్టణంలోని ప్రధాన రహదారులు వరద నీటితో పొంగిపొర్లడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు నీటిలో ప్రయాణించేందుకు అవస్థలు పడగా, పాదచారులు రహదారులు దాటేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థపై వర్షపు నీటి ప్రవాహం ఒత్తిడి పెరగడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది.

తిరువూరు బస్టాండ్ ప్రాంతానికి కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు వర్షపు నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షంతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు మందగించాయి. తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.