BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 09:49 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

కొత్తపేటలో కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
07 Nov, 2026 - 09:49 AM
34 వీక్షణలు

ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు.. కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

కొత్తపేట (ఎన్ టుడే న్యూస్):

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో నవంబర్ 7న నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడంతో పాటు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.

జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం రూరల్ సీఐ సి.హెచ్. విద్యాసాగర్, కొత్తపేట ఎస్సై జి. సురేంద్ర ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.


వాహనాల మళ్లింపు మార్గాలు ఇవే..

రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే వాహనాలు బోడిపాలెం బ్రిడ్జి, వాడపాలెం, అడ్డకాలువ, వానపల్లి, ముక్తేశ్వరం మీదుగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.

అదేవిధంగా అమలాపురం నుంచి రావులపాలెం వెళ్లే వాహనాలు పలివెల వంతెన, పలివెల గ్రామం, గంటి చెక్‌పోస్టు, ఈతకోట మీదుగా వెళ్లాలని తెలిపారు.

వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకుని, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కొత్తపేట ఎస్సై జి. సురేంద్ర కోరారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన వి.కె.వి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం పరిశీలించారు. కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, భద్రతా విధులను సమర్థంగా నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

ఈ పరిశీలనలో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, స్పెషల్ బ్రాంచ్ సీఐ పుల్లారావు, రావులపాలెం రూరల్ సీఐ సి.హెచ్. విద్యాసాగర్, ఎస్సై జి. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.