తిరువూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో విషాదం
డెలివరీ కోసం వచ్చిన డెంటల్ డాక్టర్ తాళ్ల దీప్తి మృతి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన తాళ్ల దీప్తి (32) మృతి చెందారు. తిరువూరు శాంతినగర్‌కు చెందిన దీప్తి డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. దీప్తి మగ బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం అధిక రక్తస్రావం జరిగినట్లు తెలిపారు. పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలించాలని వైద్యుడు సూచించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే అప్పటికే పరిస్థితి మరింత విషమించడంతో దీప్తి మృతి చెందినట్లు పేర్కొన్నారు.
దీప్తి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న వారు అంబులెన్స్‌లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఘటనపై పూర్తి వివరాలు, వైద్య కారణాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.