BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 29 September 2026, 10:30 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఘట్‌కేసర్‌లో విషాదం.. రైలు ఢీకొని 100కుపైగా గొర్రెలు మృతి

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
29 Sep, 2026 - 10:30 PM
6 వీక్షణలు

ఘట్‌కేసర్, సెప్టెంబరు 29 (ఎన్‌టుడే న్యూస్): ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో 100కుపైగా గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కేపాల్ సమీపంలో గొర్రెల కాపరి నిద్రిస్తున్న సమయంలో కాజీపేట నుంచి హైదరాబాద్ నాంపల్లి వైపు వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు అటుగా వచ్చింది. రైలు శబ్దానికి బెదిరిపోయిన గొర్రెలు ఒక్కసారిగా పట్టాలపైకి పరుగులు తీయడంతో వేగంగా వచ్చిన రైలు వాటిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 100కుపైగా గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. తమ జీవనాధారమైన గొర్రెలు కళ్లముందే మృతి చెందడంతో కాపరులు తీవ్ర విషాదానికి గురయ్యారు. మృతి చెందిన గొర్రెలు యాదాద్రి-భువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందినవిగా గుర్తించినట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గొర్రెల పెంపకంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఈ ఘటనతో భారీగా నష్టం వాటిల్లిందని కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరారు.