BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 06:57 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

సుస్థిర, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
20 Nov, 2026 - 06:57 PM
23 వీక్షణలు

వెన్నూరు రైతుసేవా కేంద్రంలో అవగాహన కార్యక్రమం.. 35 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ

కొండపి, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

జిల్లా వనరుల కేంద్రం, ఒంగోలు ఆధ్వర్యంలో రైతులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా కొండపి మండలం వెన్నూరు రైతుసేవా కేంద్రంలో సుస్థిర, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు పూర్వాభ్యాస శిక్షణ నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మేడికొండ మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ రత్నమంజుల, సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ. నిర్మలకుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు సుస్థిర, ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎరువుల పంపిణీ విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం (FFS) గురించి రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత రబీ సీజన్‌కు సంబంధించి శనగ విత్తనాలను 35 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ రత్నమంజుల మాట్లాడుతూ.. ఆత్మ విభాగం ద్వారా గ్రామస్థాయిలో రైతులకు వివిధ వ్యవసాయ అంశాలపై అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలను సద్వినియోగం చేసుకుని రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసి ప్రజలకు అందించవచ్చని పేర్కొన్నారు.

సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ. నిర్మలకుమారి మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాల గురించి రైతులకు వివరించారు.

మండల వ్యవసాయ అధికారి మేడికొండ మాల్యాద్రి మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల వివరాలను వారి నుంచి తెలుసుకుని, వాటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్యక్రమం చివరలో రైతులకు వివిధ రకాల కషాయాలు, జిగురు అట్టలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి శైలజారాణి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎస్తేర్ రాణి, ఏఈఓ కుమార్, వీఏఏలు లింగారావు, బుజ్జి, జ్యోత్స్నతో పాటు వెన్నూరు గ్రామ రైతులు పాల్గొన్నారు.