BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 October 2026, 03:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రీసర్వే పనుల్లో పారదర్శకత పాటించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 03:45 PM
3 వీక్షణలు

రీసర్వే పనుల్లో పారదర్శకత పాటించాలి రైతుల సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టాలి ఆర్డీవో ఏ. కుమార్ ఆదేశాలు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏ. కొండూరు మండలం కోడూరు రెవెన్యూ గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే గ్రౌండ్ ట్రూథింగ్ (జీటీ) పనులను తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ శనివారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, రీసర్వే ద్వారా కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ సర్వేయర్లు రైతుల సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టాలని, భూముల సరిహద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని ఆదేశించారు.

రీసర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. భూముల కొలతలు, సరిహద్దులు, విస్తీర్ణానికి సంబంధించి రైతులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలోనే పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రీసర్వే పనులను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆర్డీవో ఏ. కుమార్ స్పష్టం చేశారు.