BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 26 September 2026, 05:42 pm
Posted by : SEETHA KIRAN KUMAR

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Sep, 2026 - 05:42 PM
60 వీక్షణలు

వరంగల్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా న్యూ శాయంపేటలో ఆమె విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రజక సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ ధైర్యసాహసాలను, తెలంగాణ ఉద్యమంలో ఆమె పోషించిన పాత్రను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజుతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌, కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయి, సత్య శారద పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమెకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, ఎదురొడ్డి నిలిచిన తీరు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

రజక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొని చాకలి ఐలమ్మ సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు.