నవరాత్రి బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు పలు రకాల ప్రత్యేక దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపింది.
ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు, చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనాలతో పాటు ఎన్‌ఆర్‌ఐ, డిఫెన్స్ కోటా దర్శనాలను కూడా ఈ పది రోజుల పాటు నిలిపివేయనున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాల సమయంలో దర్శన ఏర్పాట్లను టీటీడీ కట్టుదిట్టం చేస్తోంది. కాగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.