నేపాల్‌లో గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు
ఫెరిచే హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ సమయంలో ప్రమాదం.. ఒక విదేశీయుడు మృతి, మరొకరికి గాయాలు
సోలుకుంభు, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
నేపాల్‌లోని సోలుకుంభు జిల్లాలో రెండు హెలికాప్టర్లు గాల్లో ఢీకొని కూలిపోయిన ఘటన కలకలం రేపింది. ఫెరిచే హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
రోటర్ బ్లేడ్స్ తగలడంతో ప్రమాదం
రెండు హెలికాప్టర్ల రోటర్ బ్లేడ్స్ ఒకదానికొకటి తగలడంతో అవి అదుపుతప్పి కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక విదేశీయుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
రెండు సంస్థలకు చెందిన హెలికాప్టర్లు
ప్రమాదానికి గురైన హెలికాప్టర్లు ఫిష్‌టెయిల్ ఎయిర్, డైనాస్టీ ఎయిర్ సంస్థలకు చెందినవిగా గుర్తించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ప్రమాదంపై దర్యాప్తు
ఒకే సమయంలో రెండు హెలికాప్టర్లు ల్యాండింగ్‌కు ఎందుకు ప్రయత్నించాయి? ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.