హఫీజ్ బాబా నగర్‌లో కత్తితో దాడి.. ఒకరి హత్య
అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. సీసీటీవీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
నగరంలోని హఫీజ్ బాబా నగర్‌లో తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. సయ్యద్ ఒమర్ అలియాస్ మషల్లా ఒమర్‌ను గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం.
అడ్డుకునేందుకు వెళ్లిన వ్యక్తిపైనా దాడి
ఒమర్‌పై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సయ్యద్‌పై కూడా దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ
ఈ ఘటనకు సంబంధించి అమన్ ఖురేషి, అలీ భైసా పేర్లను స్థానికులు అనుమానితులుగా పేర్కొన్నట్లు సమాచారం. అయితే, వారి ప్రమేయం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. కాంచన్‌బాగ్ పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.