సన్నూరు స్వయంభూ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్
తెలంగాణ
/
వరంగల్
ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన మామిడాల యశస్వినిరెడ్డి, డా. సత్యశారద
వెంకటేశ్వరపల్లి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని సన్నూరు స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, జిల్లా కలెక్టర్ డా. సత్యశారద మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు
ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌కు ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.