జబల్పూర్ ఐఐఐటీడీఎంలో వరంగల్ విద్యార్థిని మృతి
హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది
వరంగల్, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లె గ్రామ పరిధి బుచ్చినాయక్ తండాకు చెందిన విద్యార్థిని వైష్ణవి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ఐఐఐటీడీఎంలో మృతి చెందినట్లు సమాచారం. హాస్టల్ గదిలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మూడో సంవత్సరం చదువుతున్న వైష్ణవి
సమ్మయ్య, కమల దంపతుల కుమార్తె అయిన వైష్ణవి జబల్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లో మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తండాలో విషాదం
వైష్ణవి మృతి సమాచారం తెలియడంతో బుచ్చినాయక్ తండాలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.