BREAKING
thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 01:16 pm
Posted by : KOLA MAHESH

అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 01:16 PM
5 వీక్షణలు

ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి.. తొలగించిన పేర్లకు కారణాలు వెల్లడించాలి

హైదరాబాద్, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో అర్హులైన పౌరులను ప్రజాస్వామ్య ప్రక్రియకు దూరం చేసే ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

తొలగింపునకు కారణాలు తెలియజేయాలి

ఓటరు జాబితా నుంచి ఏదైనా వ్యక్తి పేరు తొలగించినప్పుడు అందుకు గల కారణాలను సంబంధిత ఓటరుకు తప్పనిసరిగా తెలియజేయాలని మంత్రి సూచించారు. పేరు తొలగింపుపై ముందస్తు సమాచారం అందించడంతో పాటు, తన వాదనను వినిపించుకునేందుకు సంబంధిత పౌరుడికి తగిన అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.

అర్హుల పేర్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి

పారదర్శకమైన ప్రక్రియలోనూ పొరపాటున అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయినట్లయితే, వాటిని వెంటనే పునరుద్ధరించే సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ పేరుతో అర్హుల ఓటు హక్కుకు భంగం కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.