BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 12 August 2026, 07:32 pm
Posted by : కూనురు మధు

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానమే భరోసా

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 Aug, 2026 - 07:32 PM
77 వీక్షణలు

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానమే భరోసా

 ఈనెల 23న చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలి

ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీ విరమణ అనంతర జీవితానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాలు జయప్రదం చేయాలని మండల విద్యాధికారి సైదా నాయక్ అన్నారు. బుధవారం ఈ సందర్భంగా  చిట్యాల మండలంలోని చిట్యాల, వెలిమినేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఓ పి ఎస్  ను పునరుద్ధరించి, ఓ పి ఎస్ ను రద్దు చేయాలని కోరారు. పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఆర్థిక భద్రత, గౌరవప్రదమైన జీవనం కోసం ఓ పి ఎస్  ఎంతో కీలకమని పేర్కొన్నారు. 

ఎంపీడీవో జెల్ల పాండు మాట్లాడుతూ సి పి ఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించే వరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని టి ఎస్ సి పి ఎస్ ఈ యు నాయకులు కోరారు .ఎస్ సి పి ఎస్ ఈ యు నల్గొండ జిల్లా అధ్యక్షుడు పంతంగి కరుణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పున్న సోమనాధ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, పి ఆర్ టి యు చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి ఎలుకరాజు ఆంజనేయులు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు గరిశే అంజయ్య, ఉపాధ్యాయులు చిలుకరాజు శ్రీనివాసులు, సైదులు, మంజుల, ప్రసన్న, శారద, విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ విజయ, ఉద్యోగులు జాన్ రెడ్డి, ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు..