BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 03:54 pm
Posted by : PAGADALA DEVAIAH

డ్రగ్స్ నిర్మూలనపై ప్రజానాట్యమండలి కళాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
10 Nov, 2026 - 03:54 PM
31 వీక్షణలు

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డి. నాగమల్లేశ్వరరావు

హైదరాబాద్, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనతో పాటు సమాజంలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ప్రజానాట్యమండలి హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కళాయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. కళాయాత్ర ఆహ్వాన సంఘ గౌరవ సలహాదారు, జీహెచ్‌ఎంసీ గణాంకాల అధికారి డి. నాగమల్లేశ్వరరావు పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డి. నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలో డ్రగ్స్, గంజాయి వినియోగం యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల యువత తమ ఆశయాలను, జీవితాలను నాశనం చేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

మన పరిసరాల్లో, ఇంటి పక్కన లేదా రోడ్లపై ఎవరైనా డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నగరంలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కోరారు.

మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చైతన్యం తీసుకురావడానికి ప్రజానాట్యమండలి కళాయాత్ర నిర్వహించేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. ఒక్కరు లేదా ఇద్దరి ప్రయత్నాలతో మాత్రమే డ్రగ్స్ నిర్మూలన సాధ్యం కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసినప్పుడే ఆశించిన మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కళాయాత్ర డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగనుంది. పాటలు, కళారూపాల ద్వారా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, యువతకు మంచి భవిష్యత్తుపై సందేశం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి నగర నాయకులు ఎం. మారన్న, నగర అధ్యక్షుడు కళ్యాణ్, నగర నాయకులు ఎం. రాము, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.