BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 11:26 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంత్రి నారా లోకేశ్ పనితీరుపై ఉపాసన కొణిదెల ప్రశంసల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 11:26 AM
38 వీక్షణలు

 జల్లు ‘రాక్స్టార్ మంత్రి’ అంటూ అభివర్ణన..

యువతకు నిజమైన ప్రతినిధి అని కొనియాడిన అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ మంత్రి నారా లోకేశ్ పనితీరుపై అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో లోకేశ్ చూపిస్తున్న చొరవ, వేగం, కార్యదక్షత అభినందనీయమని కొనియాడారు. ఆయనను ‘రాక్స్టార్ మంత్రి’గా అభివర్ణిస్తూ, నేటి యువతకు నిజమైన ప్రతినిధిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంతో పాటు దేశ ప్రగతికి నారా లోకేశ్ అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని ఉపాసన అభిప్రాయపడ్డారు. ఆయనలో కనిపించే ఉత్సాహం, చురుకుదనం, పనుల పట్ల నిబద్ధత రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన చూపిస్తున్న ప్రత్యేక చొరవను ఆమె ప్రశంసించారు. కేవలం 16 నెలల స్వల్ప వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌కు 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం సాధారణ విషయం కాదని, ఇది రాష్ట్రానికి గొప్ప విజయమని ఉపాసన కొనియాడారు. ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునివ్వడంతో పాటు ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడుల ద్వారా పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం కావడమే కాకుండా, రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతున్న నారా లోకేశ్ నాయకత్వం, పనితీరు యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తోందని ఉపాసన ప్రశంసించారు.