BREAKING
thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి
Date of Publish : 06 October 2026, 08:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో వడ్డే ఓబన్న వర్ధంతి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 08:52 PM
62 వీక్షణలు

పెనుగొలనులో వడ్డే ఓబన్న వర్ధంతి పెనుగొలనులో వడ్డే ఓబన్నకు ఘన నివాళి

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ వడ్డే ఓబన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యసాహసాల వీరుడని కొనియాడారు. 1807 జనవరి 11న నంద్యాల జిల్లా నోస్సం గ్రామంలో వడ్డెర కుటుంబంలో జన్మించిన ఓబన్న, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అండగా నిలిచి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించారని తెలిపారు.

వడ్డెర, బోయ, చెంచు, యానాది తదితర వర్గాలకు చెందిన సుమారు 2 వేల మందితో గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడినట్లు వక్తలు వివరించారు. బ్రిటిష్ ఖజానాలను లక్ష్యంగా చేసుకోవడం, దోపిడీకి పాల్పడిన అధికారులను ఎదుర్కోవడం వంటి చర్యలతో బ్రిటిష్ పాలకులను ఎదుర్కొన్న ధైర్యశాలి వడ్డే ఓబన్న అని పేర్కొన్నారు.

1846 అక్టోబర్ 6న కర్నూలు జిల్లాలోని పేరు సోముల కొండ వద్ద బ్రిటిష్ సైన్యంతో జరిగిన పోరులో వీరోచితంగా పోరాడుతూ వడ్డే ఓబన్న వీరమరణం పొందారని గుర్తుచేశారు. ఆయన త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

కార్యక్రమంలో సాయి బాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, వడ్డెర సంఘం నాయకులు కుంచం వెంకటేశ్వర్లు, బూసి ఏడుకొండలు, కుంచం రామకృష్ణ, కుంచం గోపాలకృష్ణ, కుంచం కృష్ణ, కుంచం బ్రహ్మం, బై ముతక గోపి, తమ్మిశెట్టి చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.