BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 09:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యార్థులపై దాష్టీకానికి సమాధానం చెప్పాలి....

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 09:59 PM
73 వీక్షణలు

విద్యార్థులపై దాష్టీకానికి సమాధానం చెప్పాలి.. డీసీపీ కార్యాలయానికి రాహుల్

ప్రజల పక్షాన ఇంత నిజాయితీగా.. నిర్భీతిగా పోరాడే నాయకులు ఎంతమంది?

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద జూలై 20న విద్యార్థులపై చోటుచేసుకున్న పోలీసుల చర్యపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. పోలీసుల చర్యకు గురైన విద్యార్థితో కలిసి ఢిల్లీ డీసీపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన, ఘటనపై ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై బలప్రయోగానికి అనుమతి ఇచ్చిందెవరో కేంద్ర హోంశాఖ, ఢిల్లీ పోలీసులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. విద్యార్థుల గొంతును అణచివేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

అధికార వ్యవస్థను ప్రశ్నిస్తూ, బాధితుల పక్షాన నిలబడే నాయకత్వం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పదవులు, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. సమస్య ఎదురైనప్పుడు బాధితుల వద్దకు వెళ్లి అండగా నిలిచే నాయకత్వమే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు.