ఢిల్లీ సీఎంకు విజయవాడ దసరా ఉత్సవాలకు ఆహ్వానం
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు విజయవాడ దసరా ఉత్సవాలకు ఆహ్వానం
విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలకు హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివారి దసరా ఉత్సవాల విశిష్టతను, ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని ఢిల్లీ సీఎంకు వివరించారు.
అలాగే విజయవాడ నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో నిర్వహిస్తున్న **‘విజయవాడ ఉత్సవ్ 2.0’**కు హాజరై నగర సాంస్కృతిక వైభవాన్ని వీక్షించాలని రేఖా గుప్తాను ఆహ్వానించారు.
విజయవాడ దసరా ఉత్సవాలు, నగర సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేయడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందించేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు.