BREAKING
thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Date of Publish : 23 September 2026, 10:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ భవానీపురంలో వైభవంగా ‘డూండి’ గణపతి నవరాత్రి ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 10:24 PM
15 వీక్షణలు

72 అడుగుల మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

విజయవాడ భవానీపురంలో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పర్యావరణహితంగా రూపొందించిన 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహా గణపతిని దర్శించుకున్న ఆయనకు వేదపండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో మంత్రి ఫొటోలు దిగారు. కార్యక్రమంలో డూండి గణేష సేవా సమితి వ్యవస్థాపకులు డూండి రాకేష్, ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో పాటు డూండి గణేష సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.