BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 29 September 2026, 06:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 06:59 PM
21 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల వద్ద మంగళవారం సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి తెలిపారు.

మండలంలోని విస్సన్నపేట, చండ్రుపట్ల గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొని రైతులకు ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. 96 గ్రాముల నూకలకు 2 గ్రాముల వేరుశనగ నూనె, 2 గ్రాముల బ్రోమోడయాలిన్ మందును కలిపి, 10 గ్రాముల చొప్పున పొట్లాలుగా తయారు చేసి ఎలుకల బొరియల్లో ఉంచాలని సూచించారు. ఒకే ప్రాంతంలోని రైతులందరూ ఒకేరోజు సామూహికంగా ఎలుకల నివారణ చర్యలు చేపట్టినప్పుడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అధికారులు తెలిపారు.

బ్రోమోడయాలిన్ మందు అవసరమైన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి 100 శాతం రాయితీపై ఉచితంగా పొందాలని మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి సూచించారు. అనంతరం బ్రోమోడయాలిన్ మిశ్రమాన్ని తయారు చేసే విధానాన్ని రైతులకు ప్రదర్శన ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఉషారాణి, గ్రామ సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.