BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 01 August 2026, 03:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వందేమాతరం గీతం జాతిని ఏకం చేసిన మహామంత్రం: బండి సంజయ్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 03:20 PM
72 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణంలో శనివారం ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంవ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని వందేమాతరం పూర్తి గీతం పోస్టర్లు, ప్యాకెట్ కార్డులను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర సంగ్రామంలో అసేతు హిమాచలాన్ని ఏకం చేసిన మహామంత్రం "వందేమాతరం" అని అన్నారు. బంకించంద్ర ఛటర్జీ కలం నుంచి వెలువడిన ఈ మహోన్నత గీతం భారతీయుల్లో దేశభక్తిని రగిలించిందని, ఆ గీతం ఆవిర్భవించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు వందేమాతరం పూర్తి గీతం పాడే పోటీలను ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వయంగా బహుమతులు అందజేస్తానని తెలిపారు.

ప్రజ్ఞ భారతి ప్రతినిధులు మాట్లాడుతూ, కరీంనగర్ పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థులకు వందేమాతరం పూర్తి గీతం ప్యాకెట్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు పాఠశాలల్లో పోస్టర్లను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ భారతి చైర్మన్ రాజ భాస్కర రెడ్డి, సముద్రాల నాగేశ్వరరావు, మందల నాగేశ్వరరావు, వెచ్చా మురళి, జె. సత్యనారాయణ రెడ్డి, డి. శ్రీనివాస్, సీఏఓ నిరంజనాచారి, యలగందల సత్యనారాయణ, గాజుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.