BREAKING
thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం
Date of Publish : 06 October 2026, 01:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా వరుణ యాగం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 01:36 PM
4 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ఎల్‌నినో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కాంక్షిస్తూ నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.

సకాలంలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, జపాలు నిర్వహించారు. హోమగుండం వద్ద వేద పండితులు శాస్త్రోక్త విధానాలతో యాగ క్రతువును పూర్తి చేశారు.

వర్షాల కోసం ప్రాచీన కాలం నుంచే వరుణ యాగాలు నిర్వహించే ఆధ్యాత్మిక సంప్రదాయం ఉందనే నేపథ్యంతో, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సమృద్ధి, సకాలంలో వర్షాలు, పంటలకు అనుకూల వాతావరణం కలగాలని ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.