BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 02:36 pm
Posted by : SYED SAMEER

ఎల్బీనగర్‌లో అర్ధరాత్రి వాహనాలకు నిప్పు.. రెండు బైక్‌లు దగ్ధం

తెలంగాణ
/ రంగారెడ్డి / అమంగల్
Reporter
Syed Sameer Hayathnagar Mandal
10 Nov, 2026 - 02:36 PM
18 వీక్షణలు

సిరి నగర్ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తుల దుశ్చర్య.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

హైదరాబాద్ నగరంలో వాహనాలకు నిప్పంటిస్తున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరి నగర్ కాలనీలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పంటించారు. ఇళ్ల ముందు పార్క్ చేసి ఉంచిన బైక్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ఘటనకు పాల్పడటంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒక ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధం కాగా, మరో బైక్ పాక్షికంగా కాలిపోయింది. ఒక్కసారిగా వాహనాల నుంచి మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఒక బైక్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మరో వాహనం కూడా కొంతమేర దెబ్బతింది.

సీసీటీవీ కెమెరాల్లో నిందితుల కదలికలు

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కాలనీలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. వాహనాలకు నిప్పంటించిన అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు ఫుటేజ్‌లో కనిపించినట్లు సమాచారం. ఈ దృశ్యాలను పరిశీలించడం ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇదే ప్రాంతంలో గతంలోనూ రెండు కార్లకు నిప్పంటించిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒకే ప్రాంతంలో వరుసగా వాహనాలు అగ్నికి ఆహుతవుతుండటంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల ముందు వాహనాలను పార్క్ చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు పేర్కొంటున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

తాజా ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాలనీలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఆకతాయిల చర్యలు ఉన్నాయా? లేక వ్యక్తిగత కక్షలతోనే వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

వరుసగా చోటుచేసుకుంటున్న వాహనాల దహనం ఘటనలపై పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకుని నిందితులను గుర్తించాలని సిరి నగర్ కాలనీవాసులు కోరుతున్నారు.