BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 07:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నెమలిలో వైభవంగా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కల్యాణం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Sep, 2026 - 07:11 PM
18 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు గోపాలాచార్యుల ఆధ్వర్యంలో ముందుగా రుక్మిణీదేవి సమేత వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల నడుమ కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కల్యాణ వేడుకలను తిలకించేందుకు నెమలి గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వామివారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కల్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన స్వామివారి కల్యాణ మహోత్సవంతో నెమలి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.