రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
ఆంధ్రప్రదేశ్: గ్రామాల రూపురేఖలను మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు.
గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.5,391 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.5,694 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది.
‘పల్లె పండుగ 3.0’లో భాగంగా గ్రామాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు రైతు కుటుంబాలకు సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది.