BREAKING
thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ
Date of Publish : 06 October 2026, 06:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎర్రమాడులో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం గ్రామీణ ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు అందుబాటులోకి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 06:13 PM
10 వీక్షణలు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఎర్రమాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే అనంతరం ర్యాలీగా వెళ్లి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు. అనంతరం క్లినిక్‌లో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్యం సకాలంలో అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు, అవసరమైన పరీక్షలు, ఆరోగ్య సలహాలు అందేలా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు విలేజ్ హెల్త్ క్లినిక్‌లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎర్రమాడు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.