BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 06:38 pm
Posted by : K MAHESH

బాలలపై జరిగే నేరాల నియంత్రణకే గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 06:38 PM
12 వీక్షణలు

బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాలు, అక్రమ రవాణా, వేధింపుల నివారణకు కమిటీ కృషి చేయాలి: సర్పంచ్ పులి వెంకన్న

నెల్లికుదురు, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

గ్రామీణ ప్రాంతాల్లో బాలలపై జరిగే నేరాలను నియంత్రించడంతో పాటు, పిల్లల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తోందని నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న తెలిపారు. బాలల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.

మండల కేంద్రమైన నెల్లికుదురులో ఐసీడీఎస్ నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ ఎన్. సరిత ఆధ్వర్యంలో మంగళవారం జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (వీసీపీసీ)ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పులి వెంకన్న మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో బాలలపై జరిగే నేరాలు, వేధింపులను అరికట్టేందుకు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

పిల్లలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు తల్లిదండ్రులకు, బాలలకు బాలల హక్కుల గురించి వివరించాలని సూచించారు. ముఖ్యంగా బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణా, శారీరక, మానసిక వేధింపుల నుంచి పిల్లలను రక్షించేందుకు కమిటీ సభ్యులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. బాలలతో భిక్షాటన చేయించడం, పిల్లల పట్ల లింగ వివక్ష చూపడం వంటి సమస్యలను గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అనంతరం గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఎంపిక చేశారు. కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి.

  • చైర్మన్: సర్పంచ్ పులి వెంకన్న

  • కన్వీనర్: అంగన్‌వాడీ టీచర్ మద్ది విజయ

  • సభ్యులు: ఉపసర్పంచ్ మంచాల వెంకన్న, కళాశాల ప్రిన్సిపాల్ వీరస్వామి, ఉపాధ్యాయుడు పెరుమాండ్ల యాదగిరి గౌడ్, పంచాయతీ కార్యదర్శి దేవయ్య, ఆశా వర్కర్ రజిత, బాలల సంఘ సభ్యులు చందు, రాజారాం, వీపీవో, మత పెద్ద జహీర్ పాషా, పాఠశాల కమిటీ చైర్మన్ మమత.

అంగన్‌వాడీ టీచర్లు ఈ.ఐ. పద్మ, మయ్య పద్మ, కె. పద్మ, టీ. జ్యోతి, మాధవి, పిల్లలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలల సమస్యలను గుర్తించి, వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు.