BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Nov, 2026 - 02:21 PM
4 వీక్షణలు

582 జెడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఈ నెల 7న ఓట్ల లెక్కింపు ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 5వ తేదీ గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 582 జెడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31,472 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలింగ్ ప్రాంతాల్లో పటిష్ఠ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో 1,841 అత్యంత సమస్యాత్మక, 2,645 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నారు. ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్లను వినియోగించనున్నారు. అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.