వీఆర్ఏల ఆందోళన 21వ రోజుకు.. ప్రభుత్వం స్పందించాలి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో కొనసాగుతున్న వీఆర్ఏల ధర్నా
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన ఆందోళన 21వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు నిరసన కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా నూజివీడు డివిజన్ వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు షేక్ సైదులు మాట్లాడుతూ, వీఆర్ఏలకు ప్రమోషన్లు, పే స్కేలు అమలు చేయడంతో పాటు నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలకు కూడా వీఆర్ఏ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. 21 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు.
వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, తమ డిమాండ్లను అమలు చేయాలని షేక్ సైదులు కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనను కొనసాగిస్తామని తెలిపారు.