కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు
కదిరి: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) కదిరి తహసీల్దార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో వీఆర్ఏలు చేపడుతున్న సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కదిరి మండలంలోని వీఆర్ఏలు కూడా మంగళవారం నుంచి ఉద్యమంలో పాల్గొంటారని తెలిపారు.
ఈ సందర్భంగా వీఆర్ఏలు తహసీల్దార్‌తో మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను ఉన్నతాధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలి.
అర్హత కలిగిన గ్రామ రెవెన్యూ సహాయకులకు వీఆర్వోగా పదోన్నతులు కల్పించాలి.
వీఆర్ఏలకు అటెండర్, వాచ్‌మన్ పదోన్నతులు కల్పించాలి.
పదోన్నతుల కోటాను 30 శాతం నుంచి 70 శాతానికి పెంచాలి.
నామినల్ వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ గ్రామ రెవెన్యూ సహాయకులుగా నియమించాలి.
తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వీఆర్ఏలు కోరారు.
కార్యక్రమంలో కదిరి మండలం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు మహేష్, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, చంద్రశేఖర్, కృష్ణమ్మ, నరసింహులు, నాగభూషణం, వెంకటేష్, గంగాధర, పవన్ తదితరులు పాల్గొన్నారు.