BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 11:58 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వీవీఐటీ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అధికారుల సూచన

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 11:58 AM
17 వీక్షణలు

ఉజ్వల భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం గుంటూరు: మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని, విద్యార్థులు వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని గుంటూరు డివిజన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు సూచించారు. పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని వీవీఐటీ విశ్వవిద్యాలయంలో మంగళవారం గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం, వాటి దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ.. మత్తు పదార్థాల అలవాటు విద్యార్థుల ఆరోగ్యంతో పాటు వారి విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు తెలియజేశారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై తీసుకునే చట్టపరమైన చర్యలను వివరించారు. అక్రమ మద్యం తయారీ, నాటుసారా విక్రయాలు, గంజాయి సరఫరా, ఇసుక అక్రమ రవాణా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తిస్తే 14405 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి. అరుణకుమారి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈ. మారయ్యబాబు, ఇన్‌స్పెక్టర్ కె. రవికుమార్, ఎస్‌ఐలు ఎండీ కె. షరీఫ్, పి. తిరుమలేశ్వరరావు, ఇతర అధికారులు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.