BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 29 September 2026, 02:48 pm
Posted by : SEETHA KIRAN KUMAR

చేనేత మగ్గాలను పరిశీలించిన వరంగల్ సీపీ శ్వేత

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
29 Sep, 2026 - 02:48 PM
4 వీక్షణలు

వరంగల్: స్థానిక చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ సోమవారం కొత్తవాడలోని చేనేత మగ్గాలను సందర్శించి కార్మికుల పనితీరును పరిశీలించారు. చేనేత ఉత్పత్తుల తయారీ విధానం, వాటి ప్రత్యేకతలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

వరంగల్ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన కొత్తవాడ కార్పెట్స్‌ను సీపీ శ్వేత పరిశీలించారు. కార్పెట్స్ తయారీకి సంబంధించిన చరిత్ర, సంప్రదాయ పద్ధతులు, తయారీ ప్రక్రియ గురించి వివరాలు తెలుసుకున్నారు.

టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత ఆధ్వర్యంలో కొత్తవాడకు వెళ్లిన సీపీ శ్వేత చేనేత తయారీలోని వివిధ దశలను స్వయంగా పరిశీలించారు. నూలు పట్టడం, కండెలు చుట్టడం, అచ్చు అతకడం, మగ్గం నేయడం తదితర ప్రక్రియల గురించి కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తయారయ్యే కొత్తవాడ కార్పెట్స్, శాయంపేట టవల్స్, లుంగీలు, బెడ్‌షీట్లు, మహదేవ్‌పూర్ దస్రు పట్టు చీరలు, జనగాం ఇక్కత్ పట్టు చీరలు తదితర చేనేత ఉత్పత్తులను పరిశీలించి వాటి నాణ్యతను తెలుసుకున్నారు.

రిటైర్‌మెంట్ కార్యక్రమాల్లో చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యం

పోలీస్ సిబ్బంది రిటైర్‌మెంట్ కార్యక్రమాల్లో సాధారణంగా అందించే శాలువాకు బదులుగా చేనేత టవల్‌తో పాటు పూజా మ్యాట్‌ను అందించాలన్న టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు విజ్ఞప్తికి సీపీ శ్వేత సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ద్వారా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి తీసుకెళ్లినట్లు తెలిపారు.

గతంలో సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన సమయంలో అక్కడ తయారయ్యే చేనేత గొల్లభామ చీరలు, శాలువాలను కొనుగోలు చేసి ఉన్నతాధికారులు, బంధువులు, స్నేహితులకు బహుమతులుగా అందించినట్లు సీపీ శ్వేత తెలిపారు. స్థానిక చేనేత ఉత్పత్తులను వినియోగించడం ద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.

వరంగల్ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా స్థానిక చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నారని చిప్ప వెంకటేశ్వర్లు తెలిపారు. సీపీ శ్వేతను ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని ఇతర అధికారులు కూడా స్థానిక చేనేత ఉత్పత్తులను ఆదరించాలని, తద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరగడానికి సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో అడిగొప్పుల సంపత్, దువ్వల రాజేందర్, యెలుగం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.