BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 01:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కుత్బుల్లాపూర్‌లో ఏసీబీ వలలో వార్డు అధికారి.. రూ.30 వేల లంచం తీసుకుంటూ పట్టుబాటు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 01:08 PM
22 వీక్షణలు

కుత్బుల్లాపూర్: లంచం తీసుకుంటూ మున్సిపల్ వార్డు అధికారి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారిగా విధులు నిర్వహిస్తున్న డి. రవీందర్ రెడ్డి ఆస్తి పేరు మార్పిడి కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఫిర్యాదిదారుడి తండ్రి పేరు మీద ఉన్న పూర్వీకుల ఇంటి ఆస్తిని తన పేరు మీదకు మార్చేందుకు అధికారికంగా సహాయం చేయాలంటే తొలుత రూ.40 వేల లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేశారు. అనంతరం బేరసారాల తర్వాత రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదిదారుడి నుంచి తన కార్యాలయంలోనే రూ.30 వేల నగదును నేరుగా తీసుకుంటుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారిక విధులను సక్రమంగా నిర్వహించాల్సిన అధికారి లంచం డిమాండ్ చేసి అక్రమంగా నగదు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదిదారుడి భద్రత దృష్ట్యా వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.