BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 29 September 2026, 07:58 pm
Posted by : కూనురు మధు

ఆసిఫ్‌నగర్ కాలువలో గుర్రపుడెక్క, నాచు, తూటి ఆకులను లభించాలి

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
29 Sep, 2026 - 07:58 PM
4 వీక్షణలు

ఆసిఫ్‌నగర్ కాలువలో గుర్రపుడెక్క, నాచు, తూటి ఆకులను లభించాలి : కలెక్టర్ చంద్రశేఖర్

ఆసిఫ్‌నగర్ కాలువపై కలెక్టర్ చంద్రశేఖర్ క్షేత్రస్థాయి పరిశీలన 

NTODAY NEWS: నార్కట్‌పల్లి,  

ఆసిఫ్‌నగర్ కాలువలో పేరుకుపోయిన పూడిక, గుర్రపుడెక్క, నాచు, తూటి ఆకులను తొలగించి దిగువ ఆయకట్టుకు సక్రమంగా నీరందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం నార్కట్‌పల్లి మండలం అక్కినేపల్లి నుంచి చిప్పలపల్లి వరకు సుమారు 4.5 కిలోమీటర్ల మేర కాలువను మోటార్‌సైకిల్‌పై స్వయంగా పరిశీలించారు. కాలువలో పూడికతో పాటు గుర్రపుడెక్క, నాచు, తూటి ఆకులు పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి దిగువ ఆయకట్టుకు నీరు సక్రమంగా చేరడం లేదని కలెక్టర్‌ గుర్తించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో శేఖర్‌రెడ్డితో మాట్లాడుతూ వి.బి.జి. రాంజీ కింద అవసరమైన ప్రాంతాల్లో పూడికతీత, గుర్రపుడెక్క, నాచు తొలగింపు పనులు చేపట్టాలని సూచించారు. పనులకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయడంతో పాటు పనులు చేపట్టే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేయించాలని ఆదేశించారు. కాలువలో పూడికతీత, కలుపు మొక్కల తొలగింపు పనులకు వీలుగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నీటి సరఫరాను నిలిపివేసేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఇరిగేషన్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం నూతనంగా ఏర్పడిన చిప్పలపల్లి గ్రామపంచాయతీని కలెక్టర్‌ సందర్శించారు. సర్పంచ్‌ అంజిరెడ్డితో మాట్లాడి గ్రామపంచాయతీ భవనంతో పాటు మహిళా సంఘ భవనాన్ని ప్రస్తుతం ఎలా వినియోగిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో శేఖర్‌రెడ్డి, ఇరిగేషన్‌ డీఈ సునీత, ఏఈ శరత్‌చంద్ర, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, అక్కనపల్లి సర్పంచ్‌ రాజు, ఆర్‌ఐ సైదులు, ఉపసర్పంచ్‌ లక్ష్మమ్మ, చిప్పలపల్లి సర్పంచ్‌ అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.