BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 02:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రకృతి వ్యవసాయంతో నీటి ఎద్దడిని తట్టుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Sep, 2026 - 02:45 PM
65 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న అందే రాంబాబు వరి పొలాన్ని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి నాట్లు వేయకముందు పచ్చిరొట్ట ఎరువులు వేసే సమయంలో పీఎండీఎస్‌ (నవధాన్యాల సాగు) చేపట్టడం వల్ల నేలలో తేమశాతం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ పీఎండీఎస్‌ పద్ధతిని పాటించిన ఈ పొలంలో పక్కనే ఉన్న ఇతర పొలాలతో పోలిస్తే తేమశాతం మెరుగ్గా ఉన్నట్లు పరిశీలనలో గుర్తించామని చెప్పారు.

ఇటీవల కురిసిన వర్షపు నీటిని రైతులు సమయపాలనతో, సమపాళ్లలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా పంటలకు నీటి ఎద్దడి రాకుండా కాపాడుకోవచ్చని సూచించారు. రసం పీల్చే పురుగుల నియంత్రణకు పసుపు రంగు అట్టలను కర్రలకు కట్టి ఎకరానికి 10 చొప్పున పొలంలో ఏర్పాటు చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన జీవామృతాన్ని రైతులు తమ పొలాల్లోనే తొట్టిలో తయారు చేసుకుని పంటపై పిచికారీ చేయడంతో పాటు సాగునీటిలో కలిపి అందించడం ద్వారా పంట నాణ్యతను మెరుగుపరచుకోవచ్చని పేర్కొన్నారు. జీవామృతం వినియోగంతో నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం పెరిగి, వర్షాభావ పరిస్థితుల్లో పంటను కొంతకాలం అదనంగా కాపాడుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు జీవామృతం తయారు చేసే విధానాన్ని క్షేత్రస్థాయిలో డెమో ద్వారా వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవామృతం వినియోగం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు తక్కువ నీటితో పంటలను సాగు చేసుకునే విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.