BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:30 pm
Posted by : K MAHESH

తీన్మార్ మల్లన్నపై దాడి కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నాం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 07:30 PM
20 వీక్షణలు

లారీతో పాదయాత్ర కాన్వాయ్‌పై దాడి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి.. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: గిరగాని బిక్షపతి గౌడ్

నెల్లికుదురు, నవంబర్ 13: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్ర కాన్వాయ్‌పై లారీతో దాడి చేసి ఆయనను అంతమొందించేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గిరగాని బిక్షపతి గౌడ్ తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బహుజనుల రాజ్యాధికార లక్ష్యంతో తీన్మార్ మల్లన్న చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర’కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఆధిపత్య వర్గాలు ఈ దాడికి కుట్ర పన్నాయని ఆరోపించారు. పాదయాత్ర కాన్వాయ్‌పై లారీతో దాడి జరిగిన సమయంలో మల్లన్న కారులో లేకుండా పాదయాత్రలో నడుస్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.

గతంలో బెల్లి లలిత, మారోజు వీరన్న వంటి బహుజన నాయకులపై జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, అదే తరహాలో మల్లన్నను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరగడం ఆందోళనకరమని బిక్షపతి గౌడ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని కోరారు. దాడికి పాల్పడిన వారితో పాటు, కుట్రకు పాల్పడినట్లు తేలిన సూత్రధారులను గుర్తించి అరెస్టు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నకు ప్రభుత్వం వెంటనే పటిష్టమైన భద్రత కల్పించాలని కోరారు.

మల్లన్నకు తగిన భద్రత కల్పించకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గిరగాని బిక్షపతి గౌడ్ హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.