BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 08:01 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కందుకూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
13 Nov, 2026 - 08:01 PM
17 వీక్షణలు

మున్సిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలి.. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి: బుర్రా మధుసూదన్ యాదవ్

కందుకూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా కందుకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి బరిలోకి దించాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని, పరస్పర సహకారంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.

నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే కందుకూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులంతా ప్రజల్లోకి వెళ్లి ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. అదే సమయంలో పార్టీ విధానాలు, ప్రజలకు అందించిన సేవలను ప్రజలకు వివరించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.

మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని, పార్టీ విజయానికి సమష్టి కృషి అవసరమని బుర్రా మధుసూదన్ యాదవ్ స్పష్టం చేశారు.