BREAKING
thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ
Test 4
Date of Publish : 05 October 2026, 10:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మా షరతులు నెరవేరే వరకూ హర్మూజ్‌ జలసంధిని తెరవం: ఇరాన్‌

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Oct, 2026 - 10:18 AM
51 వీక్షణలు

టెహ్రాన్‌, అక్టోబర్‌ 5: తమ షరతులు నెరవేరే వరకు హర్మూజ్‌ జలసంధిని పునఃప్రారంభించబోమని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాకర్‌ ఘలిబాఫ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా ఇకపై కాలయాపన చేయకుండా ఇరాన్‌ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఒక మధ్యవర్తి ద్వారా అమెరికా కొన్ని ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. ఏకపక్ష డిమాండ్లను ఇతర దేశాలపై రుద్దుతూ చర్చలను సాగదీసే పరిస్థితి ఇక ముగిసిందని ఘలిబాఫ్‌ అన్నారు. ఇరాన్‌ వైఖరి స్పష్టంగా, నిశ్చయంగా ఉందని, తమ ఏడు షరతులు నెరవేరే వరకు హర్మూజ్‌ జలసంధి తెరుచుకోదని స్పష్టం చేశారు. ఇరాన్‌ ఇప్పటికే యుద్ధ పరిస్థితుల్లో ఉందని, కొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను ఎదుర్కొంటోందని తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనలపై తమకు ఉత్సాహం కానీ, భయం కానీ లేదన్నారు. పోరాటంతో పాటు దౌత్యపరమైన చర్చలను కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి కూడా దౌత్యపరమైన పరిష్కారానికి తమ దేశం కట్టుబడి ఉందని తెలిపారు. టెహ్రాన్‌లో విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమను తాము రక్షించుకోవడంలో ఎంత నిబద్ధతతో ఉన్నామో, దౌత్యపరమైన పరిష్కారాన్ని సాధించడంలోనూ అంతే నిబద్ధతతో ఉన్నామని చెప్పారు. హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి అవసరమైన షరతులను అమెరికాకు స్పష్టంగా వివరించామని, తమ ప్రతిపాదనను అమెరికా అంగీకరిస్తుందని ఆశిస్తున్నామని అరాఘ్చి తెలిపారు. అమెరికా మరోసారి సైనిక చర్యకు దిగితే గతంలో కంటే మరింత సన్నద్ధంగా ఉన్నామని, తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.