BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 07:05 pm
Posted by : MUSUGU GOPI

ఆస్ట్రేలియా 485 వీసా నిబంధనల్లో మార్పులు.. కుటుంబ సభ్యుల దరఖాస్తుపై కొత్త ఆంక్షలు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
17 Nov, 2026 - 07:05 PM
16 వీక్షణలు

నవంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు.. విద్యార్థులతో పాటే కుటుంబ సభ్యుల దరఖాస్తు తప్పనిసరి

ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించి, చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేయాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. చదువు అనంతరం ఆస్ట్రేలియాలో ఉండేందుకు ఇచ్చే టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా (సబ్‌క్లాస్ 485) నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఇప్పటివరకు విద్యార్థులు తమకు 485 వీసా మంజూరైన తర్వాత భార్య లేదా పిల్లలను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లేందుకు విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం సాధారణంగా ఈ వెసులుబాటు ఉండదు. ప్రధాన దరఖాస్తుదారుడితోపాటు అర్హులైన కుటుంబ సభ్యులు కూడా ఒకేసారి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కొన్ని వర్గాలకు మినహాయింపులు

అయితే గతంలో స్టూడెంట్ వీసాలో డిపెండెంట్లుగా ఉన్న భార్య, పిల్లలను 485 వీసా దరఖాస్తులో చేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక వర్గాలకు కొత్త కుటుంబ సభ్యులను చేర్చుకునే విషయంలో మినహాయింపులు కల్పించారు. పసిఫిక్ దేశాలు, ఆసియాన్ సభ్యదేశాల పౌరులు, స్టూడెంట్ వీసాపై ఉన్న సమయంలోనే పీహెచ్‌డీ పూర్తి చేసినవారు, విదేశీ ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో చదువు పూర్తి చేసినవారు ఈ మినహాయింపులకు అర్హులు కావచ్చు.

పిల్లల విషయంలో ప్రత్యేక వెసులుబాటు

పిల్లలకు సంబంధించి కూడా కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. తల్లిదండ్రులకు తాజా వీసా మంజూరైన తర్వాత ఆస్ట్రేలియా వెలుపల జన్మించిన బిడ్డను తదుపరి 485 వీసా దరఖాస్తులో చేర్చుకోవచ్చు. అదే ఆస్ట్రేలియాలో 485 వీసాపై ఉన్న తల్లిదండ్రులకు అక్కడే బిడ్డ జన్మిస్తే, ఆ చిన్నారికి కూడా తల్లిదండ్రుల వీసా హోదా వర్తిస్తుంది. అయితే బిడ్డ జనన వివరాలను సంబంధిత అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాలి.

పాత దరఖాస్తులకు పాత నిబంధనలే

నవంబర్ 13 కంటే ముందే 485 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మాత్రం కుటుంబ సభ్యుల వీసా అర్హతలు, దరఖాస్తు విధానంపై ముందుగానే స్పష్టత తీసుకోవాల్సి ఉంటుంది.