BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 23 September 2026, 08:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు ఉపసంహరించుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 08:28 PM
116 వీక్షణలు

ప్రజలపై కొత్త ఆర్థిక భారం మోపొద్దు: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్

ఏలూరు జిల్లా: యూపీఐ, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్ చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధించే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు డిమాండ్ చేశారు. ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు ప్రోత్సహించి, డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే వ్యవస్థపై అదనపు ఆర్థిక భారం మోపే ప్రయత్నం చేయడం సమంజసం కాదన్నారు.

దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, సామాన్య ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్ల నుంచి ఇతర చెల్లింపుల వరకు యూపీఐపై ఆధారపడుతున్నారని తెలిపారు. చిన్న మొత్తాల చెల్లింపుల నుంచి వ్యాపార లావాదేవీల వరకు డిజిటల్ చెల్లింపులు ప్రజల రోజువారీ జీవితంలో కీలక భాగంగా మారాయని పేర్కొన్నారు.

యూపీఐ లావాదేవీలపై ప్రతి చెల్లింపుకు అదనపు రుసుము విధిస్తే చిన్న వ్యాపారుల నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పరిమిత లాభాలతో వ్యాపారాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులపై ఈ భారం పడితే చివరకు దాని ప్రభావం వినియోగదారులపైనా పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

పెట్రోల్ బంకులు, రవాణా రంగం, చిన్న దుకాణాలు, సేవా రంగం సహా అనేక రంగాల్లో యూపీఐ చెల్లింపులు విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో అదనపు ఛార్జీల నిర్ణయం సామాన్య ప్రజలపై కొత్త ఆర్థిక భారంగా మారే అవకాశం ఉందన్నారు. ప్రజలకు వేగవంతమైన, సులభమైన చెల్లింపు విధానంగా యూపీఐ వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించిన ప్రభుత్వమే ఇప్పుడు వాటిపై అదనపు ఛార్జీల విధింపునకు సంబంధించిన ప్రతిపాదనలు తీసుకురావడం ప్రజా ప్రయోజనాలకు అనుకూలం కాదని దుర్గం పుల్లారావు పేర్కొన్నారు. యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు విధించే ప్రతిపాదనలను ఉపసంహరించుకుని, ప్రజలు, చిన్న వ్యాపారులపై ఎలాంటి కొత్త ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.