BREAKING
thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
Date of Publish : 06 October 2026, 04:26 pm
Posted by : MUSUGU GOPI

బీసీలను వాడుకొని వదిలేయడమే వైసీపీకి తెలుసు-మంత్రి పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
06 Oct, 2026 - 04:26 PM
6 వీక్షణలు

అమరావతి: రిజర్వేషన్ల విషయంలో బీసీలను వైసీపీ దారుణంగా మోసం చేస్తోందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. బీసీలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లను పెంచామని ఆయన తెలిపారు.

గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు కూడా ఇదే రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాయని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. కొన్ని వర్గాలకు మేలు చేసేందుకు 60 శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తున్న సమయంలో రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులను వైసీపీ సుప్రీంకోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ఆయన ప్రశ్నించారు.

అదేవిధంగా హైకోర్టు తీర్పుపై వైసీపీ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని మంత్రి ప్రశ్నించారు. రిజర్వేషన్లు తగ్గించవద్దనే డిమాండ్‌తో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలిపారు.

రిజర్వేషన్ల అంశం కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన సమస్య కాదని, బలహీన వర్గాల భవిష్యత్తుతో ముడిపడిన అంశమని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.