పాము కాటుతో యువ రైతు మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన పట్ల ప్రభాకర్ రెడ్డి
మాజీ సర్పంచ్ గంటల మల్లేష్ యాదవ్ కుమారుడు వెంకటేష్ మృతి
బాలానగర్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ మాజీ సర్పంచ్ గంటల మల్లేష్ యాదవ్ కుమారుడు వెంకటేష్ యాదవ్ వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా పాము కాటుకు గురై మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేష్ వ్యవసాయ పొలంలో పని చేస్తున్న సమయంలో పాము కాటు వేసింది. వెంటనే ఇంటికి ఫోన్ చేసి పాము కరిచిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకునేలోపే వెంకటేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
ఈ విషాదకర విషయం తెలుసుకున్న మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు.
మృతుడు వెంకటేష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో ధైర్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు.