BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 09:45 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఫ్లయింగ్ ఆఫీసర్ డ్రెస్‌లో బేగంపేట్ పరేడ్ గ్రౌండ్‌లోకి యువకుడు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
08 Oct, 2026 - 09:45 PM
10 వీక్షణలు

హైదరాబాద్: ఫ్లయింగ్ ఆఫీసర్ దుస్తుల్లో బేగంపేట్ పరేడ్ గ్రౌండ్‌లోకి ప్రవేశించిన ఓ యువకుడిని అధికారులు అనుమానంతో అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పరేడ్ గ్రౌండ్‌లో ఫొటోలు దిగుతూ సంచరిస్తుండగా అతడి వ్యవహారశైలిపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీ చేసినట్లు సమాచారం.

తనిఖీల్లో అతడు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అధికారి కాదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతడి పేరు నితీష్ కుమార్ పాల్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. బీహార్‌కు చెందిన అతడు ప్రస్తుతం నేరెడ్‌మెట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పేర్కొన్నారు.

తాను ఎయిర్‌ఫోర్స్ అధికారినంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రొఫైల్ ద్వారా యువతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడించాల్సి ఉంది.

అనుమానితుడిని బేగంపేట్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడు ఎయిర్‌ఫోర్స్ అధికారి దుస్తులు ఎలా పొందాడు, వాటిని ఉపయోగించి మరెక్కడైనా తిరిగాడా, సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎవరినైనా మోసం చేశాడా అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.