BREAKING
thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం
Date of Publish : 02 October 2026, 10:41 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మియాపూర్ హోటల్‌లో యువతి మృతి..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Oct, 2026 - 10:41 PM
4 వీక్షణలు

మియాపూర్ హోటల్‌లో యువతి మృతి.. ప్రియుడి కోసం పోలీసుల గాలింపు

హైదరాబాద్: మియాపూర్‌లోని ఓ హోటల్‌లో యువతి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని సంగారెడ్డికి చెందిన 27 ఏళ్ల కోమటి సృజనగా గుర్తించారు. ఆమె హనుమకొండలో పీజీ పీడియాట్రిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.


సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కు వచ్చిన సృజన ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా ఆమె మియాపూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. హోటల్‌లోని 502వ గదిలో సృజన మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం డీకంపోజ్ అయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


ఘటనకు ముందు సృజన రవికుమార్ అనే వ్యక్తితో హోటల్‌లో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అనుమానిస్తున్నారు. సృజన మృతి అనంతరం రవికుమార్ హోటల్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. గతంలో సృజన, రవికుమార్ మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అయితే కొన్ని కారణాలతో సుమారు ఆరు నెలలుగా సృజన అతడికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.


సృజన తండ్రి ఫిర్యాదులో రవికుమార్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో సృజనకు చెందిన బంగారు గొలుసును రవికుమార్ తీసుకున్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.


ఈ వ్యవహారంలో రవికుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. హోటల్ సీసీ కెమెరాల ఫుటేజీ, కాల్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. సృజన మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.