BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 08:12 pm
Posted by : KADARI RAMANA

యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకే యువజన ఉత్సవాలు

తెలంగాణ
/ నిర్మల్
03 Nov, 2026 - 08:12 PM
9 వీక్షణలు

యువత పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటుకోవాలి: అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్

నిర్మల్, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు జిల్లాస్థాయి యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాథోడ్ రమేష్ తెలిపారు.

యువజన ఉత్సవాలు ప్రారంభం

మంగళవారం సోఫీ నగర్‌లోని జేవీఎన్‌ఆర్ ఉన్నత పాఠశాలలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు–2026 సాంస్కృతిక పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యువత ఇటువంటి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద ఆశయాలు, సందేశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని, ఆయన బోధనలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.

పలు విభాగాల్లో పోటీలు

ఈ ఉత్సవాల్లో జానపద బృంద గానం, జానపద బృంద నృత్యం, నాటిక, చిత్రలేఖనం, కవితా రచన తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, యువతీయువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఆయా విభాగాల్లో ప్రథమ బహుమతి సాధించిన విజేతలు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీల్లో నిర్మల్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

పాల్గొన్న అధికారులు, న్యాయనిర్ణేతలు

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సేవల శాఖ అధికారి బి. శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి, న్యాయనిర్ణేతలు జోసఫ్, బాబురావు, ఎట్టెం రజిత, సౌమ్య, మధు, మెట్టు రవి, కొండూరు పోతన్న, విశ్వనాథ్ వర్మ, శనిగరపు నాగరాజు, వేణుగోపాల్, ఎర్రన్న, రఫీ, పేట కార్యదర్శి భూమన్న, రవీందర్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.