BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 26 September 2026, 12:19 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

సెప్టెంబర్ 30న ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
26 Sep, 2026 - 12:19 PM
109 వీక్షణలు

ఒంగోలు, Ntoday News, సెప్టెంబర్ 26: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 30న ఒంగోలుకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నట్లు వెల్లడించాయి.

కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణంపై వైఎస్ జగన్ ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. రాజశేఖర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.

రాజశేఖర్ మృతదేహానికి ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ నాయకుల ప్రకారం, రాజశేఖర్ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.

సెప్టెంబర్ 30న ఒంగోలు పర్యటనలో భాగంగా రాజశేఖర్ కుటుంబ సభ్యులను కలసి వారి పరిస్థితిని తెలుసుకుని జగన్ పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.