BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 29 September 2026, 10:49 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
29 Sep, 2026 - 10:49 PM
13 వీక్షణలు

ఒంగోలు: ఇటీవల మృతి చెందిన వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం ఒంగోలుకు వచ్చారు.

ఏబీఎం కళాశాల ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్ద వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జగన్‌మోహన్ రెడ్డితో కలిసి కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లారు.

రాజశేఖర్ కుటుంబ సభ్యులను జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించి, కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ కూడా కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జగన్‌మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు కనిగిరి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఒంగోలుకు తరలివచ్చారు. కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.