వైయస్ జగన్ ఒంగోలు పర్యటన
వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ గారి కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు
కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఒంగోలులో పర్యటించారు.
ఒంగోలు క్లౌ పేటలోని వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్ దివంగత కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లిన శ్రీ వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాకుమాను రాజశేఖర్ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన శ్రీ వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు.
కాకుమాను రాజశేఖర్ పార్టీకి అందించిన సేవలను ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ గుర్తుచేసుకున్నారు. పార్టీ పట్ల నిబద్ధతతో, అంకితభావంతో ఆయన పనిచేశారని పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.
రాజశేఖర్ కుటుంబం ఒంటరిది కాదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని శ్రీ వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి, వారికి ధైర్యం చెప్పిన అనంతరం శ్రీ వైయస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.
#YSJaganInOngole