BREAKING
thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
Test 4
Date of Publish : 16 November 2026, 05:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బస్తీపాడులో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి 100 మంది చేరిక

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 05:50 PM
1 వీక్షణలు

కాటసాని రామభూపాల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – నంద్యాల జిల్లా – పాణ్యం నియోజకవర్గం – కల్లూరు మండలం బస్తీపాడులో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి 100 మంది చేరిక కాటసాని రామభూపాల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు కల్లూరు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం బస్తీపాడు గ్రామంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన కేడీసీసీ బ్యాంకు మాజీ డైరెక్టర్ కల్లా వెంకటరమణారెడ్డి, కల్లా మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. జి. విష్ణువర్ధన్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి, బి. రేవనాథ్ రెడ్డి, అరెపల్లె శేషిరెడ్డి, బోయ రామాంజనేయులు, బోయ శేఖర్, మాజీ సర్పంచ్ బోయ రవి, బోయ లక్ష్మన్న, బోయ రాంబాబు, బోయ సురేష్, పసుల ఓబులేష్, కురువ మధు, షేక్ ఈదురు భాష, బోయ మురళి తదితరులు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాటసాని వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ టీడీపీ పాలనపై అసంతృప్తితో, వైఎస్ఆర్సీపీ నాయకత్వంపై నమ్మకంతో పలువురు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న ప్రజా పోరాటానికి మద్దతుగా బస్తీపాడులో జరిగిన చేరికలు నిలుస్తాయని అన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బస్తీపాడు, చిన్నకొట్టాల గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.